Friday, October 24, 2025
epaper

మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ విడుదల

మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ విడుదల చేశారు. సోను మల్లోజుల వేణుగోపాల్ పేరుతొ 6 పేజీల లేఖ విడుద‌ల అయింది. ఆరు పేజీల లేఖపై ఎలాంటి గుర్తు లేకుండా ప్రకటన విడుదల చేశారు. దీనిపై సోను మల్లోజుల వేణుగోపాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాత్కాలికంగా ఆయుధాలను వదిలేస్తున్నామ‌ని వెల్ల‌డించారు సోను మల్లోజుల వేణుగోపాల్.

శత్రువుల దాడిలో ఎంతో మంది కామ్రేడ్లను కోల్పోయామ‌న్నారు. అమరవీరులందరికీ పేరుపేరునా జోహార్లు తెలిపారు. ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేస్తున్నామ‌ని… ఈ ఓటమి చాలా బాధాకరమైనదన్నారు సోను మల్లోజుల వేణుగోపాల్.

తాజా వార్త‌లు