Friday, October 24, 2025
epaper

హైదరాబాద్ లో విషాదం… నీటి సంపులో ఇద్దరు చిన్నారులతో పాటు దూకిన తల్లి

ఇంట్లో ఉన్న నీటి సంపులో ఇద్దరు చిన్నారులతో పాటు దూకింది తల్లి. ఈ సంఘటన లో తల్లి బతికింది. ఇద్దరు చిన్నారులు , మరణించారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.. ఈ సంఘటన లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

తల్లి లక్ష్మి (30) ఇద్దరు బాబులతో 8 నేలలు, బాబు 3 సంవత్సరాలతో ఆత్మహత్యాయత్నం చేసింది. నీరు తక్కువ ఉండటం కారణంగా బ్రతికింది తల్లి. ఇద్దరు బాబులు మరణించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. లక్ష్మికి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇటుక బట్టీల్లో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు లక్ష్మీ భర్త లక్ష్మణ్.

తాజా వార్త‌లు