Friday, October 24, 2025
epaper

కేటీఆర్ మీద బచ్చా గాడిని నిలబెట్టి గెలిపిస్తా – పొంగులేటి సంచ‌ల‌నం

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ మీద బచ్చా గాడిని నిలబెట్టి గెలిపిస్తానంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ మూడు సార్లు వచ్చి ముక్కు నెలకు రాసినా, నన్నేం చేయలేకపోయాడు.. నువ్వెంత బచ్చా గాడివి ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కేటీఆర్ నువ్వెంత? ఓ బచ్చగాడివి అని సీరియ‌స్ అయ్యారు మంత్రి పొంగులేటి. మీ నాన్న పాలేరుకు వచ్చి మూడుసార్లు ముక్కు నేలకు రాసినా ఏం చేయలేకపోయాడన్నారు. మీ అహంకారానికి ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారని… ఇప్పుడు మూడో సారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వివ‌రించారు. ఈ మూడేళ్ల తర్వాత అసలు నువ్వు ఇండియాలో ఉంటావా కేటీఆర్? లేకపోతే లగేజ్ సర్దుకుని అమెరికా వెళ్లిపోతావా? అంటూ ఆగ్ర‌హించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

తాజా వార్త‌లు