Friday, October 24, 2025
epaper

సద్దుల బ‌తుక‌మ్మ‌పై రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం

సద్దుల బ‌తుక‌మ్మ‌పై రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా 9 రోజులు పాటు ఘనంగా బతుకమ్మ వేడుకలు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌. గతంలో బతుకమ్మ పండుగను రాజకీయ వేదికగా మార్చుకున్నారని వెల్ల‌డించారు.

బతుకమ్మ పండుగను రాజకీయం చేయడం మంచి పద్దతి కాదని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. అచ్చమైన తెలంగాణ పండుగను కలిసికట్టుగా గ్రామం నుంచి పట్టణం వరకు ఘనంగా జరుపుకుందామ‌న్నారు. సద్దుల పండగ రోజు ఎల్బీ స్టేడియంలో స్పెషల్ బతుకమ్మ ఏర్పాటు ఉంటుందని స్ప‌ష్టం చేశారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటకి సీఎం రేవంత్ రెడ్డి, హనుమంతరావు పునర్జన్మ కల్పించారన్నారు మహేష్ కుమార్ గౌడ్.

తాజా వార్త‌లు