Friday, October 24, 2025
epaper

నేపాల్ దారుణం.. షోరూంలో దూరి టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్ లు దొంగ‌త‌నం

నేపాల్ ప్రజలకు ప్రభుత్వంపై ఆగ్రహం, షోరూమ్‌లపై ప్రేమ పుట్టుకువ‌చ్చింది. నేపాల్ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.. పోలీసులు కూడా చేతులు ఎత్తివేయడంతో ప్రజలు రెచ్చిపోతున్నారు. షోరూం లో దూరి టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్ లు దోచుకొని వెళ్తున్నారు ప్రజలు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ఇది ఇలా ఉండ‌గా… నేపాల్‌లో ప‌రిస్థితులు అత్యంత ప్ర‌మాద క‌రంగా మారాయి. నేపాల్‌లో కర్ఫ్యూ విధించారు ఆర్మీ అధికారులు. దీంతో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది భారత్. రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు యువ నిరసనకారులు. జెన్-జెడ్ ఆందోళనతో అల్లకల్లోలమైంది నేపాల్. నిరసనకారులతో నేడు సమావేశమవనున్నారు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్. అటు ఇప్ప‌టికే ప్రధాని కెపి శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో కేపి రాజీనామా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు.

తాజా వార్త‌లు